తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో ఉపాధ్యాయ నియామకాలు జరిగింది ఒకేసారి. ఉమ్మడి రాష్ట్రంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హాయంలో 2012లో చివరిసారి భర్తీ కాగా, తెలంగాణలో ఒకేసారి భర్తీ చేశారు. అది కూడా చాలా తక్కువ పోస్టులతోనే…
తెలంగాణలో విద్యాశాఖలో ఖాళీలు భర్తీ చేయాలని సీఎం ఆదేశించటంతో… అధికారులు టీచర్ల పోస్టుల ఖాళీలను లెక్కతీసే పనిలో ఉన్నారు. సంబంధిత ఉద్యోగుల కథనం ప్రకారం 20వేల పోస్టులు ఖాళీ ఉన్నట్లు అంచనా. దీంతో భారీగా ఖాళీలు ఉండటంతో టీచర్ పోస్టుల ఆశావాహులు మళ్లీ పుస్తకాల దుమ్ము దులిపే పనిలో ఉన్నారు.
అయితే, టీచర్ పోస్టుల నియామకంలో కీలకంగా ఉన్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. టెట్ కోసం 5లక్షల మంది వరకు ఎదురుచూస్తున్నట్లు అంచనా ఉంది. పైగా ప్రాథమిక విద్య కోసం ఉద్దేశించిన ఎస్జీటీలో కూడా బీఈడీ చేసిన వారికి అవకాశం ఇస్తూ ఎస్.సి.టీ.ఈ నిర్ణయం తీసుకోవటంతో ఈ ఏడాది పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
టెట్ పరీక్ష పూర్తైన వెను వెంటనే… ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం టీఆర్టీ నిర్వహించే అవకాశం ఉంది.