టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఎక్సైజ్ శాఖ క్లోజ్ చేయాలని భావిస్తుందా…? అంటే అవుననే కనపడుతుంది. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ పై వేసిన చార్జ్ షీట్ లో పలు కీలక అంశాలను ఎక్సైజ్ శాఖ ప్రస్తావించింది.
ఈ మొత్తం కేసులో బలమైన ఆధారాలేమీ లేవని అబ్కారీ శాఖ కోర్టుకు తెలిపింది. సెలబ్రిటీలపై బలమైన, తగినన్ని ఆధారాలు ఏమీ లేవని చార్జ్ షీట్ లో పేర్కొంది. వారిపై కెల్విన్ అనేక విషయాలు చెప్పినా అవేవీ నమ్మశక్యంగా లేవని తెలిపింది. నటులపై కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం విచారణను తప్పుదోవ పట్టించేలా ఉందని అబ్కారీ శాఖ పేర్కొంది.
సినీ తారలతో పాటు విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, హోటల్ నిర్వాకులకు తాను డ్రగ్స్ అమ్మినట్లు కెల్విన్ పేర్కొన్నారని అబ్కారీ శాఖ కోర్టుకు తెలిపింది. సిట్ బృందం పలువురికి నోటీసులు ఇచ్చి విచారించిందని తెలిపింది.