తెలంగాణలో ఆహార ధాన్యాల ఉత్పత్తి వంద శాతం పెరిగిందని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు అన్నారు. లోక్ సభలో ఈరోజు ఆయన మాట్లాడుతూ… దేశంలో ధరల పెరుగుదల వల్ల సామాన్య జనం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా గోధుమ, బియ్యం ఉత్పత్తి తగ్గిందని ఆయన చెప్పారు. కానీ తెలంగాణలో మాత్రం వాటి ఉత్పత్తి వంద శాతం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఎరువుల ధరలు మరింత పెంచారని ఆరోపించారు.
వంటగ్యాస్ ధర ఇప్పటికే వెయ్యి దాటిందని, ఇలా అయితే పేదలు, సామాన్య ప్రజలు ఎలా బ్రతుకుతారని ఆయన ప్రశ్నించారు. ధరల పెంచడంతో పేదలు మరింత పేదలుగా మారుతున్నారని ఆయన మండిపడ్డారు.
ప్రపంచంలో గోదుమ ఉత్పత్తి తగ్గగా, దేశంలో మాత్రం ఉత్పత్తి బాగుందన్నారు. బియ్యం ఉత్పత్తి కూడా ప్రపంచవ్యాప్తంగా 0.5 శాతం తగ్గిందన్నారు. కానీ దేశంలో మాత్రం వంద శాతం ఉత్పత్తి పెరిగిందని, ఆ పెరుగుదల తెలంగాణ నుంచే జరిగిందన్నారు.
బియ్యం ఉత్పత్తి పెరిగినా, దాన్ని కేంద్రం కొనడంలేదని ఆయన ఆరోపించారు. రైతుల నుంచి బియ్యం కొనకపోవడం వల్లే, తెలంగాణ రైతులు బాధపడుతున్నారని ఆయన అన్నారు.