తెలంగాణలో కీలక నేత, మంత్రి హరీష్ రావుకు తిరుమలలో ఘోర అవమానం ఎదురైంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల వెళ్లిన హరీష్‌రావుకు తీవ్ర పరాభావం ఎదురైంది. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమ శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన హరీష్‌రావుకు టీటీడీ అధికారులు ప్రోటోకాల్ పాటించలేదు. దీంతో ఆయన మనస్థాపం చెందటంతో పాటు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. దర్శనానికి వెళ్లేందుకు సైతం హరీష్ నిరాకరించారు. దీంతో టీటీడీ బోర్డ్ మెంబర్, హరీష్ రావు బంధువు దామోదర్ రావు సర్ధిచెప్పి హరీష్‌ను దర్శనానికి తీసుకెళ్లారు.