తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్ కు తెలంగాణలో ప్రశ్నించేతత్వం ఉన్న పాట అమ్ముడుపోయిందన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వాల ఆగడాలను కడిగిపారేసి, ప్రజలను చైతన్యవంతం చేయటంలో పాట ప్రాముఖ్యత ఎంత అంటే తెలంగాణ ఉద్యమమే మంచి ఉదాహరణ.
ఎవని పాలయ్యిందిరో తెలంగాణ… ఎవడేలుతున్నడురో తెలంగాణ అంటూ కేసీఆర్ ను విమర్శిస్తతూ గజ్జెకట్టి పాటపాడిన ఏపూరి సోమన్న ఇప్పుడు షర్మిల గూటికి చేరారు. ఇప్పుడున్న సమయంలో నా రాజకీయ భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని, షర్మిలతో మాట్లాడిన తర్వాతే పార్టీలో చేరాలని నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించారు.
అయితే, రేవంత్ రెడ్డి టీడీపీలో ఉండగా… ఆయన కోసం టీడీపీ తరుపున, ఆ తర్వాత తెలంగాణ ఇంటిపార్టీ తరుపున, ఇటీవల రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా మళ్లీ కాంగ్రెస్ కోసం ఆడిపాడిన ఏపూరి సోమన్న… షర్మిల పార్టీలో ఎప్పటి వరకు ఉంటారో చూడాలి.