మేడ్చల్ జిల్లా అత్తేల్లిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి 44పై రాష్ట్ర అటవీశాఖ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కారు ఓ వ్యక్తిని ఢీ కొట్టింది. దీంతో ఆ వ్యక్తి మృతి చెందాడు.
మృతున్ని మేడ్చల్ పట్టణానికి చెందిన గౌర్ల నర్సింలు(48) పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో ప్రతాప్ రెడ్డి ఆ వాహనంలోనే ఉన్నారు.
వాహనంలో ప్రతాప్ రెడ్డిని గుర్తించి పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు.వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రతాప్ రెడ్డి మరో వాహనంలో అక్కడి నుంచి పంపించి వేశారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.