తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
రాష్ట్ర ప్రజలకు విషెస్ చెబుతూ ప్రధాని మోడీ…’ దేశాభివృద్ధి కోసం కష్టపడే స్వభావం, అంకిత భావాలకు తెలంగాణ ప్రజలు పర్యాయపదాలు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. రాష్ట్ర ప్రజలు సర్వతోముఖాభివృద్ధి సాధించాలని కోరుకుంటుననాను’ అని ట్వీట్ చేశారు.
‘తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. అభివృద్ధి సూచికల్లో ప్రశంసనీయమైన పురోగతిని తెలంగాణ సాధించింది. పరిశ్రమలకు కేంద్రంగా ఆవిర్భవించింది. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను’ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు.
ప్రజల ఆకాంక్షల నుంచి తెలంగాణ పుట్టిందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. గత ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. ఉజ్వల తెలంగాణ నిర్మాణానికి నిబద్ధతతో కాంగ్రెస్ ఉందని ఆయన పునరుద్ఘాటించారు.