గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం తెలంగాణ శాసన సభ, శాసన మండలిలో చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా మండలిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మహిళలకు ప్రత్యేక పథకాలు తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అన్నారు.
రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మీ, న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ అందరికీ ఇస్తున్నామని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే.. ప్రతిపక్ష నాయకులు కాళ్ళలో కట్టెలు పెడుతున్నారంటూ మండిపడ్డారు.
మండలిలో కంటి వెలుగు సెంటర్ ఏర్పాటు చేయాలని ఎద్దేవా చేశారు. 54 వేల మంది మిడ్ డే మీల్స్ వండే కార్మికులు ఉన్నారని తెలిపారు.
వాళ్లకు మొన్నటి వరకు రూ.1000 మాత్రమే జీతం ఇచ్చేవాళ్లము. ఇప్పుడు వాళ్ల కోరిక మేరకు ఇప్పుడు రూ.3 వేలు ఇస్తున్నామన్నారు. అందులో రూ.600 మాత్రమే కేంద్రం ఇస్తోంది.. మిగతా రూ.2400 రాష్ట్రం ఇస్తోందని వెల్లడించారు కవిత.