పోలవరంపై ఏపీ సర్కార్ ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ అభ్యంతరం తెలిపారు. దీనిపై గోదావరి నది యాజమాన్య బోర్డుకు లేఖ రాశారు. తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరం తెలుపుతున్న ఏపీ..పోలవరంపై కొత్త ప్రాజెక్టులను ప్రతిపాదించడం సరికాదని పేర్కొన్నారు.
గోదావరి నది యాజమాన్య బోర్డు ఈ విషయమై జోక్యం చేసుకోవాలని కోరారు. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఏపీ ప్రతిపాదిత ఎత్తిపోతల పథకం వలన గోదావరి డెల్టా ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని వివరించారు. పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి నీటి ఎత్తిపోతల సరికాదని వివరించారు.
పోలవరంపై ఏపీ సర్కార్ కొత్త ప్రాజెక్టులను ప్రతిపాదించడం చట్ట విరుద్ధమని తెలంగాణ ఈఎన్సీ తెలిపారు. ఓ వైపున తెలంగాణ ప్రాజెక్టులకు అభ్యంతరం తెలుపుతూ మరో వైపున కొత్త ప్రాజెక్టులను ప్రతిపాదించడం ఎంత వరకు సబబని లేఖలో అడిగారు.