ఏపీపై తుంగభద్ర బోర్డుకు తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. ట్రైబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా కృష్ణా జలాలను కేసీ కెనాల్‌కు తరలించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించింది. ఈ మేరకు తుంగభద్ర బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. దాన్ని అడ్డుకోవాలని తుంగభద్ర బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది.
సుంకేశుల ఆనకట్ట ద్వారా కేసీ కెనాల్ ఆయకట్టుకు తుంగభద్ర జలాలను మాత్రమే వినియోగించాలని తెలిపింది. కానీ తుంగభద్ర జలాలను తుంగభద్ర హైలెవెల్ కెనాల్‌కు తరలించి, శ్రీశైలం ద్వారా కృష్ణా జలాలను కేసీ కెనాల్‌కు తరలించాలని ఏపీ భావిస్తోందని పేర్కొంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇలా కృష్ణా జలాలను కేసీ కెనాల్ కు తరలించడం ట్రైబ్యునల్ తీర్పునకు విరుద్ధమని చెప్పింది. ఇప్పటికే ఏపీ రెండు టీఎంసీల నీటిని తరలించిందని, తాజాగా మరో రెండు టీఎంసీల నీటి తరలింపునకు ప్రయత్నాలు చేస్తోందని వెల్లడించింది.
ఈ క్రమంలో ఏపీ ప్రయత్నాలను నిలువారించాలని బోర్డును కోరింది. కేసీ కెనాల్‌కు కృష్ణా జలాల తరలింపును నిలిపివేయాలని తెలంగాణ సర్కార్ కోరింది. వెంటనే దీనిపై వెంటనే స్పందించి కృష్ణా జలాలా కేటాయింపులు జరపాలని లేఖలో కోరింది.