– 2022లో 6.9వేల కోట్ల అమ్మకాలు
– ఈ ఏడాది 13వేల కోట్ల టార్గెట్
హైదరాబాద్, తొలివెలుగు:తెలంగాణ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల కోసం నిధులు సమీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ భూముల విక్రయం, ఆక్రమణలను క్రమబద్ధీకరణల ద్వారా రూ.13,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది.
పోచారం, బండ్లగూడ ప్రాంతంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల విక్రయానికి ప్రభుత్వం వేలం నిర్వహించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూమిని వేలం ద్వారా విక్రయిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భూములు అమ్మకంపై రూ.10వేల కోట్ల సమీకరణ టార్గెట్ పెట్టుకోగా రూ.6,900 కోట్లు వచ్చాయి.
భూముల విక్రయించడం ద్వారా పన్నేతర ఆదాయాన్ని పెంచుకోవడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దృష్టి సారించారు. ఈక్రమంలోనే ఇటీవల జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ, ఫైనాన్స్, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ తదితర శాఖల అధికారులతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. నిరుపయోగమైన ప్రభుత్వ భూములను ఇప్పటికే జిల్లా కలెక్టర్లు గుర్తించారు.
దీంతో వాటిని విక్రయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జీవో-59 కింద మార్కెట్ విలువతో ప్రభుత్వ భూమి ఆక్రమణలను నియంత్రించేందుకు ఇప్పటిటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించి సుమారు 14 వేల దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయి.
పూర్తి కథనం..