అన్నదాతలకు అండగా ఉంటాయంటూ తెలంగాణ ప్రభుత్వం అర్భాటంగా ఏర్పాటు చేసిన రైతు బంధు సమితుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. పంటలపై సూచనలు, మార్కెటింగ్ వెసలుబాట్లు, గిట్టుబాటు ధర కల్పించే వంటి బాధ్యతలను ఈ రైతు బంధు సమితులు నిర్వర్తిస్తాయని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. అయితే కేంద్ర సాగు చట్టాలకు తెలంగాణ ప్రభుత్వం మద్దతు పలకడంతో.. మొత్తం సీన్ మారిపోయింది. ఇప్పటికే ఉన్న కొనుగోలు కేంద్రాలను కూడా ఎత్తివేస్తున్నట్టు కేసీఆర్ సర్కార్ ప్రకటించడంతో… రైతు బంధు సమితుల సంగతి ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పంటను ఎక్కడ అమ్ముకోవాలి.. ఎంతకు అమ్ముకోవాలో రైతులే నిర్ణయించుకోవాల్సినపుడు.. ఇక రైతుబంధు సమన్వయ సమితులు ఏం చేయాలనేది ప్రశ్నగా మారింది. రైతు బంధు సమితికి రాష్ట్రవ్యాప్తంగా 1,60,995 మంది సభ్యులు ఉన్నారు. ఆ మధ్య కొత్త పాసుబుక్‌లు, రైతు బీమా బాండ్లు ఇచ్చిన సమయంలో హడావుడి చేసిన వీరంతా.. ఆ తర్వాత వారు ఉన్నారో లేరో తెలియని పరిస్థితి నెలకొంది. సభ్యుల సంగతేమిటో తెలియదు కానీ.. పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాత్రం రైతు బంధు సమితి చైర్మన్‌గా అధికార హోదాను అనుభవిస్తున్నారు. మద్దతు ధర అంశంతో ఇకపై తమకు సంబంధం లేదని చెప్తున్న అధికార పార్టీ నేతలు.. ఈ రైతు బంధు సమితులపై
Telangana: Government to decide which crop to be grown in each district under regulated farming policy
కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.