కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లో చేరిన హుజురాబాద్ నేత కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలని క్యాబినెట్ గవర్నర్ కు సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు చేసి నెల రోజులు కావొస్తున్నా ఇంత వరకు దీనిపై గవర్నర్ తమిళిసై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
అయితే, మంత్రివర్గం సిఫార్సులను ఆమోదించాల్సి ఉన్నప్పటికీ… కౌశిక్ రెడ్డిపై పలు కేసులున్నాయి. దీంతో ఆ ఫైలు ఇంకా గవర్నర్ వద్దే పెండింగ్ లో ఉంది.
Advertisements
తాజాగా దీనిపై గవర్నర్ తమిళిసై స్పందించారు. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా గుర్తించాలంటూ క్యాబినెట్ చేసిన సిఫార్సు ఫైల్ తన వద్దే పెండింగ్ లో ఉందని, ఆ ఫైల్ విషయంలో నాకు కొంత సమయం కావాలని తెలిపారు.
ఈ ఫైల్ విషయంలో గవర్నర్ న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారని, అందుకే నిర్ణయం ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.