హుస్సేన్ సాగర్ లో హైదరాబాద్ సెయిలింగ్ వీక్ ప్రారంభమైంది. గవర్నర్ తమిళిసై చేతులమీదుగా స్టార్ట్ అయిన ఈ పోటీలు ఈనెల 19 వరకు జరగనున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన 120 మంది క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారు.
రాష్ట్రానికి వచ్చిన సెయిలర్లకు స్వాగతం పలికారు గవర్నర్. ఈ క్రీడ ఎంతో క్లిష్టమైందని.. గాలి వేగాన్ని తట్టుకుని ముందుకెళ్లడం గొప్ప విషయమన్నారామె. కాసేపు బోటులో విహరించిన గవర్నర్… ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన అథ్లెట్లను అభినందించారు.