తెలంగాణ గవర్నర్ తమిళిసై తల్లి కృష్ణకుమారి కన్నుమూశారు. ఇటీవల ఆమె అస్వస్థతకు గురవ్వడంతో.. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆరోగ్యం విషమించడంతో ఇవాళ ఉదయం కృష్ణకుమారి తుదిశ్వాస విడిచారు.
గవర్నర్ తల్లి మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. చెన్నైలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.