తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో… రాజకీయాలు శరవేగంగా మారుతోన్నాయి. ఓ పక్క దాదాపు 50వేల మంది ఆర్టీసీ కార్మికులను రోడ్డున పడేసిన ప్రభుత్వం, మరోపక్క వేల కోట్ల అవినీతిపై కేంద్ర సంస్థల లెక్కలకు తోడు… కేసీఆర్ ప్రభుత్వం-మెఘా కృష్ణారెడ్డి సంస్థల మద్య క్విడ్‌ప్రోకో జరిగినట్లు డిల్లీ ఐటీ సంస్థల సోదాల్లో బట్టబయలైనట్లు తెలుస్తోంది. అందుకే హుటాహుటిన గవర్నర్ తమిళసైని డిల్లీకి పిలిపించినట్లు డిల్లీ వర్గాల సమాచారం.
మెఘా ఇండ్లు, ఆఫీసులపై నాలుగు రోజులుగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో కేసీఆర్-మెఘా-మైహోం రామేశ్వర్‌రావు త్రయం ఎలా తెలంగాణ ప్రాంతంతో విచ్చలవిడిగా దోచుకుంటున్నాయో మీడియా లెజెండ్ రవిప్రకాశ్ ఇప్పటికే కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేశారు. సీనీయర్ మహిళా జర్నలిస్ట్ రేవతి కూడా ఇదే అంశంపై ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు. ఆ తర్వాతే రాష్ట్రంలోని ఐటీ అధికారులకు పూర్తిస్థాయి సమాచారం ఇవ్వకుండానే, నేరుగా డిల్లీ టీంలు రంగంలోకి దిగి… మెఘా ఆస్తులను జల్లెడపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్‌కు డిల్లీ పిలుపుపై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.
త్వరలో మెఘా అరెస్ట్ ఉంటుంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో… రాష్ట్రంలో పరిస్థితులపై కేంద్ర హోంశాఖ గవర్నర్ నివేధిక కోరనుంది. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె, బలిదానాల నేపథ్యంలో…. గవర్నర్‌కు డిల్లీ పిలుపు వచ్చింది. 12గంటలకు డిల్లీ బయలుదేరనున్న గవర్నర్, మద్యాహ్నం 3గంటలకు ప్రధాని నరేంద్రమోడీతో, 4గంటలకు బీజేపీ అద్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కాబోతున్నారు.