గవర్నర్ గా తాను రాజకీయాలు మాట్లాడలేనంటూనే… గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ పదవి అంటే విశ్రాంతి తీసుకోవటానికి కాదు, సీఎంవోతో పాటు గవర్నర్ ఆఫీసులు ప్రజలకు మేలు చేయటానికేనని ప్రకటించారు.
తాను త్వరలోనే గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తానన్న ఆమె, సీఎంతో సంబంధాలపై కూడా కామెంట్ చేశారు. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా ఉంటే ఎలాంటి వివాదాలుండవన్నారు. ఇక యూనివర్శిటీలకు వీసీల నియామకంపై కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వమే నెల రోజుల్లో వీసీల నియామకాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చిందన్నారు.