గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పట్టణ వాసులకు మరో ఆఫర్ ప్రకటించింది. జీహెచ్ఎంసీలో 2020-21 సంవత్సరంలో ఆస్తి పన్నులో రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 15 వేల వరకు ఆస్తి పన్ను ఉన్న వారికి 50 శాతం రాయితీ అదేవిధంగా రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో 10 వేల పన్ను ఉన్న వారికి 50 శాతం రాయితీ కల్పిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
అయితే, ఇప్పటికే ఆస్తిపన్ను చెలించిన వారికి వచ్చే ఏడాది ఈ రాయితీని సర్దుబాటు చేయనున్నారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఒకవైపు కరోనా, మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో పేద, మధ్య తరగతి వర్గాల వారికి భారీ ఊరట కల్పిస్తూ సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ వెల్లడించారు.
ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టేందుకే సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.