ఈనెల 20వ తారీఖు నుండి తెలంగాణలో పాఠశాలలను ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మొదట 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు డిజిటల్ క్లాసులు నిర్వహిస్తామని, దూరదర్శన్ తో పాటు టీ-శాట్ ఛానళ్ల ద్వారా పాఠాలు చెప్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. క్లాసులు మిస్ అయిన వారికి యూట్యూబ్ లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇక 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు సెప్టెంబర్ 1 నుండి డిజిటల్ క్లాసులు నిర్వహిస్తామని, ఈ నెల 17నుండి 50శాతం టీచర్లు పాఠశాలలకు తప్పనిసరిగా హజరు కావాలని స్పష్టం చేసింది.
ఇక ఈ నెల 17 నుండే ఇంటర్ విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు మొదలుపెట్టడంతో పాటు సెప్టెంబర్ నుండి ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామన్నారు.