సంచలనం సృష్టించిన ”దిశ” కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం సిట్ ను నియమించింది. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి నేతృత్వంలో ఇద్దరు మహిళా డీసీపీ అధికారులు ఈ సిట్ లో సభ్యులుగా ఉన్నారు. సిట్ దర్యాప్తును ఎప్పటికప్పుడు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్ సమీక్షిస్తుంటారు.
కేసును సాధ్యమైనంత త్వరగా విచారించి నిందితులకు శిక్షలు పడేలా చేయాలని దేశవ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచారణకు హైకోర్టు ఆదేశించింది. దీనికనుగుణంగా దర్యాప్తును వేగవంతం చేసేందుకు ప్రభుత్వం పోలీస్ ఉన్నతాధికారులతో సిట్ ను నియమించింది. ఏడు రోజుల నిందితుల పోలీసు కస్టడీ అనంతరం సిట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చార్జీ షీట్ దాఖలు చేయనుంది.