గ్రేటర్ హైదరాబాద్ లో అపార్టుమెంట్లలో ఇంటి పనిలో సహాయం చేసే వారిపై నిర్ణయం తీసుకోవాల్సింది అపార్ట్మెంట్స్ అసోసియేషన్స్ అని మున్సిపల్ శాఖ సూచించింది. ఇప్పటి వరకు ఉన్న నిషేధం ఎత్తివేస్తున్నప్పటికి… వారిని పనిలోకి అనుమతించాల్సిన అసోసియేషన్లు నిర్ణయం తీసుకుంటాయని తెలిపింది.
లాక్ డౌన్ సడలింపులు వచ్చినప్పటికీ… ఇంటి పనిలో సహాయం చేసే వారిని పనిలోకి తీసుకునేందుకు అపార్ట్మెంట్ అసోసియేషన్లు ఆసక్తి చూపలేదు. ముఖ్యంగా గ్రేటర్ జోన్లలో కరోనా వైరస్ కేసులను దృష్టిలో ఉంచుకొని అసోసియేషన్లు, ప్రభుత్వం మరికొన్నిరోజుల పాటు వద్దని నిర్ణయించాయి.