అసలే రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ముంచుకొస్తుందన్న భయం నెలకొంది. మరోవైపు యూకే నుండి వచ్చిన కరోనా కొత్త వైరస్ కేసులు రాష్ట్రంలోనూ నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో న్యూ ఇయర్ వేడుకలను రద్దు చేసుకోమని సలహా ఇవ్వాల్సింది పోయి సర్కార్ మందుబాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.
న్యూ ఇయర్ వేడుకలు రెడీ అవుతున్న సందర్భంగా డిసెంబర్ 31న అంటే గురువారం అర్ధరాత్రి 12గంటల వరకు వైన్ షాప్స్ ఓపెన్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇక బార్లు, పబ్బులకు అర్ధరాత్రి 1గంట వరకు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు తాగి డ్రైవింగ్ చేస్తే పదేళ్లు లైసెన్స్ రద్దు చేస్తామని, జైలు శిక్ష తప్పదంటూ పోలీసులు హెచ్చరిస్తుండగా… ప్రభుత్వం మాత్రం అర్ధరాత్రి దాటేంత వరకు బార్లు, వైన్స్ లు ఓపెన్ చేసుకునేందుకు అనుమతివ్వటం చర్చనీయాంశంగా మారింది.