కరోనా విజృంభణతో మూతబడిన విద్యాసంస్థలను తిరిగి తెరవడంపై తెలంగాణ ప్రభుత్వం నేడు నిర్ణయం తీసుకోనుంది. మంత్రులు, కలెక్టర్లతో జరిగే ఉన్నత స్థాయి సమీక్షలో ఇందుకు సంబంధించిన తుది నిర్ణయం వెలువడే అవకాశముంది. అలాగే విద్యా సంవత్సరం పొడిగింపు, పరీక్షల నిర్వహణపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏయే తరగతులను నిర్వహించాలి? ఏ విధంగా నిర్వహించాలనే దానిపై సమాలోచనలు జరపనున్నారు. ఇప్పటికే విద్యా సంస్థలను పునః ప్రారంభించిన రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏ విధానంలో క్లాసులను నిర్వహిస్తున్నారన్న అంశాలను పరిశీలించనున్నారు.
ఇక ఆకాడమిక్ ఇయర్ ఇప్పటికే సగానికిపైగా పూర్తి కావడంతో.. పరీక్షల విధానంలో కూడా మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. విద్యాసంస్థలు ప్రారంభించాల్సి వస్తే.. మే వరకు తరగతులు నిర్వహించ యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలిసింది. కాగా, ఇప్పటికే ఈ నెల 18 లేదా 20వ తేదీ నుంచి విద్యాసంస్థలను పునః ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు విద్యాశాఖ తెలిపింది.