రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్తను ప్రకటించింది. రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్బంగా హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఆ హామీని నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ రుణమాఫీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈమేరకు ముందడుగు వేసింది. రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది.
2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 వరకు రుణాలు తీసుకోన్న వారు ఈ రుణమాఫీకి అర్హులని పేర్కొంది. ఈమేరకు వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. లక్ష వరకు ఋణం తీసుకొన్న వారికీ నాలుగు విడతలుగా రుణమాఫీ చేయనుంది. ఇక రూ.25 వేల లోపు రుణం ఉన్న వారికి ఒకే దఫాలో రుణం మాఫీ కానుంది. చెక్కుల ద్వారా రుణమాఫీ మొత్తాన్ని ప్రభుత్వం అందించనుంది. ఈ చెక్కులను ఎమ్మెల్యేలు, మంత్రులు రైతులకు అందజేయనున్నారు