తెలంగాణ రాష్ట్ర రాబడి పూర్తిగా తగ్గిపోయిందని, హళ్లికి హళ్లి… సున్నకు సున్న అంటూ తెలంగాణ సామేత చెప్పిన కేసీఆర్, చెప్పినట్లుగానే తనతో సహా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కష్టం వచ్చింది కాబట్టి అందరం పంచుకుందాం అంటూ ప్రకటన చేశాడు.
ప్రైవేటు సంస్థలకు పని చేయక పోయినా తమ ఉద్యోగులకు జీతాలివ్వాల్సిందేనని చెప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు… ఇప్పుడు ప్రభుత్వమే జీతం కట్ చేస్తే, ఇక ప్రైవేటు వాడు ఊరుకుంటాడా అన్న ప్రశ్న ఒకటి అయితే… కేవలం 15 రోజుల ఆదాయం పోతేనే జీతాలివ్వలేనంత ధనిక రాష్ట్రమా తెలంగాణ అన్న ప్రశ్నలు సహాజంగానే తెరపైకి వస్తున్నాయి.
ఒక జీతాల్లో కతలు అని ప్రకటన ఇచ్చిన మరుసటి రోజే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొత్త పనుల కోసం దాదాపు 21వేల కోట్ల పనులకు టెండర్లు పిలుస్తూ నిర్ణయం తీసుకుంది. ఓ వైపు డబ్బులు లేవు అంటూనే కొత్త టెండర్లకు డబ్బులు ఎలా వచ్చాయి అని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు.
అప్పు తెచ్చయినా ఉద్యోగులను కాపాడుకుంటామని చెప్పే ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఇలా ప్రభుత్వ ఉద్యోగులు కరోనా వైరస్ కు భయపడుతూనే పనిచేస్తుంటే… సీఎం ఇచ్చే గిఫ్ట్ ఇదేనా అంటూ ఉద్యోగులు సైతం ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.