తెలంగాణలో కరోనా కేసులు ఏమాత్రం తగ్గటం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకు పెరుగుతుంది. రాష్ట్రంలో గత 24గంటల్లో 1921కొత్త కేసులు రాగా, 9మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 88,396కు చేరుకోగా, మరణాల సంఖ్య 674కు చేరింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 23,438యాక్టివ్ కేసులుండగా, 64,284మంది సంపూర్ణంగా కోలుకొని ఇంటికి చేరుకున్నారు. తాజాగా వచ్చిన కేసుల్లో ఎక్కువ కేసులు జీహెచ్ఎంసీలోనే నమోదైనప్పటికీ 356కొత్త కేసులు మాత్రమే వచ్చినట్లు ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాలో 134, మేడ్చల్ లో 168మందికి కొత్తగా కరోనా సోకింది.