సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటుకు సహకరించాటలని లేఖలో ఆయన కోరారు. సామాన్యుడికి కూడా విమానయానాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు 2016లో కేంద్ర్ం ‘ఉడాన్’ పథకాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు.
దానికి అనుగుణంగా తెలంగాణలోనూ అన్ని రకాల అనుమతులు ఉన్న ఆదిలాబాద్, జక్రాన్‌పల్లి, వరంగల్ విమానాశ్రయాల నిర్మాణం జరిగితే చిన్న, ప్రైవేటు విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలుంటుందని ఆయన లేఖలో వెల్లడించారు.
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఎయిర్ పోర్టుల నిర్మాణం ద్వారా ఎయిర్ వేస్ అనుసంధానత కోసం అవసరమైన డెవలప్‌మెంట్ చేసి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ స్పందించడం లేదని ఆయన అన్నారు. కేంద్రం అందిస్తున్న సహకారాన్ని ఉపయోగించుకుంటూ ఆదిలాబాద్, జక్రాన్ పల్లి (నిజామాబాద్), వరంగల్ విమానాశ్రయాల నిర్మాణానికి ముందుకు రావాలని ఆయన లేఖలో కోరారు.
విమానాశ్రయాల నిర్మాణం. ఇతర అంశాలకు సంబంధించి ఎయిర్ పోర్ట్ అథారిటీ, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సీఎం కేసీఆర్ కు పలు మార్లు లేఖ రాసినా స్పందన రాలేదంటూ ఆయన లేఖలో చెప్పారు. పౌర విమానయాన శాఖ మంత్రి లేఖకు కొనసాగింపుగా ఈ విమానాశ్రయాల అభివృద్ధికి సహకరించాలని కోరుతూ తాను స్వయంగా సీఎంకు 30 జూలై, 2022 నాడు లేఖ రాశానన్నారు. దీనికి కూడా సీఎం కార్యాలయం నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.