ప్రైవేటు యూనివర్శిటీలకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 5 కాలేజీలకు యూనివర్శిటీ గుర్తింపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపగా… గెజిట్ కూడా విడుదలైంది.
కొత్తగా యూనివర్శిటీ గుర్తింపు పొందని కాలేజీలను చూస్తే
1. మహింద్రా వర్సిటీ- కుత్బుల్లాపూర్
2. వోక్స్ సేన్ వర్సిటీ- మెదక్ జిల్లా సదాశివపేట
3. మల్లారెడ్డి వర్సిటీ- మేడ్చల్ జిల్లా దూల్లపల్లి
4. అనురాగ్ వర్సిటీ- ఘట్ కేసర్
5. ఎస్.ఆర్ వర్సిటీ- వరంగల్ అర్భన్ లను యూనివర్శిటీలుగా గుర్తిస్తూ ఆర్డినెన్స్ జారీ అయ్యింది. ఈ యూనివర్శిటీల్లో సామాజిక రిజర్వేషన్లు ఉండవు. కేవలం స్థానిక కోటాలో 25శాతం రిజర్వేషన్ మాత్రమే అమలులో ఉంటుంది. మొత్తం 13
కాలేజీలు యూనివర్శిటీ హోదా కోసం దరఖాస్తు చేసుకోగా కేవలం 5 కాలేజీలకు మాత్రమే గుర్తింపు వచ్చింది.
పెండింగ్ లో ఉన్న కాలేజీలు
వాగ్దేవి
విజ్ఞాన్ గ్రూప్
అమిటీ
రాడ్ క్లిప్
శ్రీనిధి
ఎంఎన్ఆర్
గురునానక్
నిక్మార్
అయితే, కొత్తగా యూనివర్శిటీ గుర్తింపు పొందిన 5 కాలేజీల్లో మూడు టీఆర్ఎస్ నేతలలవే కావటం గమనార్హం. అనురాగ్ విద్యాసంస్థలు రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందినవి కాగా, మల్లారెడ్డి యూనివర్శిటీ మంత్రి మల్లారెడ్డికి చెందినవి. ఇక వరంగల్ లోని ఎస్.ఆర్ విద్యాసంస్థలు టీఆర్ఎస్ నేత వరదారెడ్డికి చెందినవి.