కరోనా వైైరస్ విజృంభణతో నిరవధికంగా మూతబడిన విద్యాసంస్థలను తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రులు, జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశం తర్వాత ఇందుకు సంబంధించిన ప్రకటన చేసింది. ఫిబ్రబరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో విద్యా సంస్థల పునః ప్రారంభానికి ప్రభుత్వం ఒకే చెప్పింది. అయితే 9వ తరగతి, ఆపై నుంచి అన్ని తరగతులకు సంబంధించిన విద్యా సంస్థలను తెరిచేందుకు మాత్రమే ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కరోనా నివారణ జాగ్రత్తలను పాటిస్తూ.. తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విద్యాశాఖ ఇవాళో, రేపు విడుదల చేయనుంది. మొత్తానికి 10 నెలలుగా మూతబడిన విద్యా సంస్థలు.. మరో 20 రోజుల్లో తిరిగి తెరుచుకోనున్నాయి.