తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా రంజాన్ సందర్భంగా ప్రతి ముస్లిం కుటుంబానికి గిఫ్ట్ ప్యాక్ పంపిస్తుంది అని సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతటి కరోనా వైరస్ ఇబ్బందిలో ప్రభుత్వం ఈ గిఫ్ట్ లు పంచటం అవసరమా అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ న్యూస్ సంస్థ ఈ కథనాన్ని ప్రచురించటంతో జనం అంతా నిజమనే నమ్మారు.
కానీ ఈ యేడాది ప్రభుత్వం రంజాన్ పండుగ గిఫ్ట్ ను అందించటం లేదు. గత సంవత్సరాల్లో ఇచ్చిన బ్యాగులను ఈ సంవత్సరం ఇచ్చినట్లుగా కథనాలు రాయటంతో ఈ విషయం పెద్దదైందని తెలుస్తోంది.
సహాజంగానే సామాజిక అంశాలపై ఫోకస్ ఎక్కువగా ఉండే ఇండియాలాంటి దేశాల్లో ఇలాంటి తొందరపాటు కథనాలు మంచిది కాదని, ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
तेलंगाना सरकार मुसलमानों को रमज़ान कि स्पेशल किट फ्रि में दे रही है।
हिन्दू के त्यौहार रामनवमी,हनुमान जयंती,उगादि पर घर से भी बाहर निकलना मना था. pic.twitter.com/8bUb3LaQU6
— Suresh Chavhanke “Sudarshan News” (@SureshChavhanke) May 11, 2020