తెలంగాణలో ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 1 నుంచి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం, మే 2 నుంచి 20 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరుగుతాయని ఇంటర్మీడియేట్ బోర్డు తెలిపింది. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఏప్రిల్ 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్.. ఏప్రిల్ 3న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ ఉంటాయని ఇంటర్మీడియేట్ బోర్డు ప్రకటించింది. ఇక ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు క్లాసులతో పాటే ప్రాక్టికల్స్ కూడా నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది.
మరోవైపు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాలేజీలను నిర్వహించాలని ఇటీవల సూచించిన ప్రభుత్వం.. ఒక రోజు ఫస్టియర్, రెండోరోజు సెకండియర్ విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని తెలిపింది.