తెలంగాణ విద్యుత్‌శాఖలో భారీగా ఉద్యోగులు కావాలంటూ నోటిఫికేషన్ విడుదలైంది. టీఎస్ఎస్‌పిడిసిఎల్‌లో 500 పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. నవంబర్ 20 వరకు అప్లై చేసుకొవడానికి అవకాశం ఇవ్వగా… జిల్లాల కేడర్‌గా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
డిగ్రీ పూర్తిచేసిన వారు ఈ జాబ్స్‌కు అర్హులు. అయితే… కాస్తంత కంప్యూటర్ పరిజ్ఙానం తప్పనసరి. 34 ఏళ్లలోపు వారు అర్హులని సంస్థ ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు పరీక్ష ఫీజు కూడా లేదు. ఇతరులకు 120రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.