తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ నిరుద్యోగులకు శుభవార్తను ప్రకటించింది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళల డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈమేరకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మొదట తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కలశాలలో ఖాళీగా ఉన్న 19 ప్రిన్సిపాల్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఆ తరువాత తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలలో ఖాళీగా ఉన్న 15పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
అదనంగా మరో 10 ప్రిన్సిపాల్ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి రావడంతో దరఖాస్తు గడువును పొడిగించింది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్-TREIRB ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీ జరగనుంది. దరఖాస్తు గడువును 2020 మార్చి 30 వరకు పొడిగించినట్లు అధికారులు పేర్కొన్నారు. విద్యార్హత- 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉతీర్ణత కలిగి ఉండటంతోపాటు పీహెచ్‌డీ అర్హత కలిగి ఉండాలని తెలిపారు.
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్స్‌లో తెలుసుకోవచ్చు.