ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు మొట్టికాయలు వేస్తున్న నేపథ్యంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ నెంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, ప్రాపర్టీ టాక్స్ నెంబర్ వంటివి అడగకూడదని… పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలంటూ హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
తమ ఆదేశాలను పాటిస్తామని చెబుతూనే… ప్రభుత్వం తెలివిగా వ్యవహరిస్తుందని, తన పద్ధతి మార్చుకోకపోతే రిజిస్ట్రేషన్లపై స్టే ఇస్తామని హెచ్చరించింది. దీనిపై అనేక తర్జనభర్జనల తర్వాత తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరుతూ… సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు సమాచారం.