వ‌ల‌స కూలీల‌తో కిక్కిరిసిపోయిన హైద‌రాబాద్ రైల్వే స్టేష‌న్లు - Tolivelugu

వ‌ల‌స కూలీల‌తో కిక్కిరిసిపోయిన హైద‌రాబాద్ రైల్వే స్టేష‌న్లు

తెలంగాణ నుండి భారీగా వ‌ల‌స కార్మికులు త‌మ స్వ‌స్థ‌లాల‌కు వెళ్లిపోతున్నారు. నాంప‌ల్లి, సికింద్రాబాద్ స్టేష‌న్లు వ‌ల‌స కూలీల‌తో కిక్కిరిసిపోయాయి. వేలాది మంది కార్మికులు ఒకే రోజు శ్రామిక్ రైళ్ల‌లో సొంత రాష్ట్రాల‌కు ప‌య‌న‌మ‌య్యారు.

సికింద్రాబాద్ నుండి రాత్రి 14 ప్ర‌త్యేక రైళ్లు బ‌య‌లుదేర‌నున్నాయి. నాంప‌ల్లి నుండి మ‌రో 8 రైళ్లు రాత్రి 9గంట‌ల నుండి బ‌య‌లుదేర‌నుండ‌గా… హైదారాబాద్ శివారు ప్రాంతాల్లోని రైల్వే స్టేష‌న్ల నుండి మ‌రో 23ప్ర‌త్యేక రైళ్లు బ‌య‌లుదేరుతున్నాయి. ప్ర‌తి రైళ్లో 18 నుండి 20 బోగీల వ‌ర‌కు ఉండ‌గా… ప్ర‌తి రైళ్లో క‌నీసం 1200మంది ప్ర‌యాణించ‌బోతున్నారు.

శ‌నివారం ఒక్క రోజే తెలంగాణ నుండి దాదాపు 50వేల మంది వ‌ల‌స కార్మికులు త‌మ స్వ‌స్థ‌లాల‌కు వెళ్తున్నారు. ఇప్ప‌టికే తెలంగాణ నుండి ల‌క్ష మందికి పైగా వెళ్లిపోయిన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించ‌గా… తాజా లెక్క‌ల‌తో 1,50వేల‌కు పైగా వెళ్లిన‌ట్లు అవుతోంది.

ఇక వీరంద‌రికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఆహ‌రం, మంచి నీరు స‌దుపాయాలు క‌ల్పించ‌గా… రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌ల‌స కార్మికుల రైల్వే చార్జీల‌ను చెల్లిస్తుంద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

Share on facebook
Share on twitter
Share on whatsapp