ఆంధ్రా ప్రభుత్వాలు… మానవీయ కోణంలో ఆలోచించలే. ప్రజల బాగును పట్టించుకోలే. కొన్ని నిర్ణయాలు మానవత్వంతో ఆలోచించాలే అంటూ ఎన్నో మాటలు చెప్పారు సీఎం కేసీఆర్. కానీ ఆంధ్రా ప్రభుత్వాల కన్నా ఘోరంగా… కేసీఆర్ సర్కార్ చేసిన పని ఇది. అభం శుభం తెలియని వారికి మరింత సహాయం చేయాల్సింది పోయి… అసలు ఉన్న సహాయాన్నే నిలిపేసిన ఘటన ఇది.
తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖను గాలికొదిలేసిందన్న విమర్శ ఉంది. అది చేశాం, ఇది చేశాం అని టీఆర్ఎస్ ఎంత చెప్పుకున్నా… ఇటీవలి కాగ్ రిపోర్ట్ చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది. సరే, మాములు పాఠశాలలను పట్టించుకోకపోతే పోయారు, కానీ హైదరాబాద్‌లో అంగవైకల్యం (చెవిటి) విద్యార్థులకు ఉన్నవి మూడే మూడు పాఠశాలలు. కానీ వాటికి కూడా ప్రభుత్వం నుండి నిధులు అందటం లేదు. దాదాపు గత సంవత్సర కాలంగా ఎలాంటి నిధులు అందకపోవటంతో పాఠశాల అద్వాన్నంగా నడుస్తోంది. ముఖ్యంగా మలక్‌పేట పాఠశాలకు 18నెలలుగా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దీంతో విద్యార్థుల కష్టాలు చూసి… గుడ్డిగా ఈ చెవిటి ప్రభత్వాన్ని నమ్మేవారు ఒక్కసారి దీని సంగతి చూడండి అంటూ మాజీ ఎంపీ కొండా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.