పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేద్దామని పిలుపునిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఓ పత్రికా ప్రకటన విమర్శలపాలవుతోంది. ప్రకటనలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయం ఫోటో విషయంలో సమాచారశాఖ అధికారులు పొరపాటుబడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ పంచాయతీ కార్యాలయానికి బదులు.. తెలంగాణలోని కార్యాలయాన్ని ఉపయోగించారు. దీంతో ఫోటోలో తెలంగాణ ప్రభుత్వ చిహ్నమైన కాకతీయ కళాతోరణం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో తెలంగాణలో కూడా పంచాయతీ ఎన్నికలేమైనా నిర్వహిస్తున్నారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. కనీస అవగాహన లేకుండా ప్రకటన రూపొందించడమేంటని విమర్శిస్తున్నారు.