కరుణాకర్, తొలి వెలుగు
కరోనా కేసుల్లో తెలంగాణ వెనకబడి ఉంది అన్న విమర్శల్లో నిజం ఉంది. దేశంలోని చాలా రాష్ట్రాల టెస్టులు లక్షల్లో ఉంటే తెలంగాణ సంఖ్య కేవలం 25వేల లోపే. ఇక చనిపోయిన వారికి, సెకండరీ కాంటాక్ట్స్ కు టెస్టులు చేయకుండా తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇది ఐసీఎంఆర్ సూచనే అని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. కానీ ఇతర రాష్ట్రాలు మాత్రం టెస్టింగ్ కెపాసిటీ పెంచుకుంటూ, టెస్టులు ఎక్కువగా చేస్తున్నాయి. కానీ ఇందులో తెలంగాణ సర్కార్ అసలు ఆలోచన వేరే ఉందన్న విమర్శలు పెరిగిపోతున్నాయి.
ప్రపంచం మొత్తం వెనుకడగు వేసిన హర్డ్ ఇమ్యూనిటీ ఆలోచనతోనే తెలంగాణ సాహసం చేస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. బ్రిటన్ లాంటి దేశాలే చేతులు కాల్చుకున్న ఈ ఆలోచన తెలంగాణ యావత్ కు తీరని ద్రోహాం అని మేధావులు హెచ్చరిస్తున్నారు.
హర్డ్ ఇమ్యూనిటీ అంటే…?
కరోనా వైరస్ ఒకరి నుండి మరొకరికి వచ్చే అంటూ వ్యాధి. కానీ రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే ఏమీ చేయలేదు. అయితే… గుండె, శ్వాసకోస, ఇతరత్రా అనారోగ్య కారణాలున్న వారికి ప్రమాదం. కానీ హార్డ్ ఇమ్యూనిటీలో భాగంగా వైరస్ వ్యాప్తి కాకుండా ఎలాంటి చర్యలు చేపట్టరు. జనాన్ని మాములుగానే వదిలేస్తారు. ఆ వైరస్ ఒకరి నుండి ఒకరికి వ్యాపించి, అలా అందరికీ అంటుంది.
సహాజంగానే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండే భారతీయుల్లో… పైగా పోలియో, బీసీజీ, మలేరియా వ్యాధి నిరోధకాలను తీసుకుంటాం కాబట్టి రోగనిరోధక శక్తి మరింత పెరుగుతుంది. అప్పుడు కరోనా వైరస్ ఏమీ చేయలేదు. కానీ అనారోగ్యంతో బాధపడే వారికి మాత్రం ఇబ్బంది తప్పదు. ఇప్పుడు ఈ స్ట్రాటజీతోనే తెలంగాణ వెళ్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిపుణులు ఏమంటున్నారు…?
ప్రపంచంలోని వైద్యారోగ్య నిపుణులంతా హార్డ్ ఇమ్యూనిటీ అంటే మండిపడుతున్నారు. ఆ ఆలోచనే పిచ్చిదని… వ్యాక్సిన్ లేని రోగానికి జనాన్ని బలి చేయటమేనని… ముఖ్యంగా వృద్ధులు, ఆరోగ్య సమస్యలున్నవారి జీవితాలతో చెలగాటమేనని స్పష్టం చేస్తున్నారు. పైగా ఓసారి వైరస్ సోకి నయం అయిన వారికి మళ్లీ మళ్లీ కరోనా సోకుతుంది. రెండ్రోజుల క్రితం ఏపీలో పూర్తిగా తగ్గాక మళ్లీ వచ్చింది. అలాంటప్పుడు వ్యాక్సిన్ తప్పనిసరి అవుతుంది. పైగా ఎంత ఇమ్యూనిటి ఉన్న కొన్ని రోజులకు మానవ శరీరం బలహీన పడుతుంది. అలాంటప్పుడు మళ్లీ వ్యాక్సిన్ కోసం చూడాల్సిందే. ఎంత పిచ్చి వారైనా ఈ నిర్ణయం తీసుకోరని మండిపడుతున్నారు. ఇలాంటి చర్యల వల్ల కనీసం 10శాతం జనాన్ని బలిపీఠంపై కూర్చోబెట్టినట్లేనని స్పష్టం చేస్తున్నారు. ఇక వేళ తెలంగాణకు హర్డ్ ఇమ్యూనిటి ఆలోచన ఉంటే… ఇవన్నీ ఆలోచించాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరీ తెలంగాణ ప్రభుత్వం కేరళ సర్కార్ తో పోటీ పడి కరోనాపై పోరాటం చేస్తుందా…లేదా హర్డ్ ఇమ్యూనిటి ట్రై చేస్తుందా అన్నది కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.