ధరణిలో ఆస్తుల నమోదుపై హైకోర్టులో విచారణ జరిగింది. నవంబరు 3న ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమైదుపై స్టే ఇస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని కోరిన ప్రభుత్వం కోరింది. సాగు భూముల యజమానుల ఆధార్, కులం వివరాలకు ఒత్తిడి చేయవద్దని నవంబరు 3న హైకోర్టు పేర్కొనగా… మధ్యంతర ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం వెకెట్ పిటిషన్ దాఖలు చేసింది.
సాగుభూములపై సబ్సిడి పథకాలు అమల్లో ఉన్నందున ఆధార్ వివరాలు అడగొచ్చని ప్రభుత్వం వాదించింది. ఆధార్ గుర్తింపు కార్డు పరిగణనలోకి తీసుకోవచ్చునని చట్టం చెబుతోందని ప్రభుత్వం కోర్టు దృష్టికి తెచ్చింది. దీంతో వెకెట్ పిటిషన్ పై అభ్యంతరాలను ఈనెల 31లోగా సమర్పించాలని పిటిషనర్లకు హైకోర్టు ఆదేశిస్తూ, తదుపరి విచారణను వాయిదా వేసింది.