సికింద్రాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఎంపీగా ఉన్న టైంలో పార్లమెంటుకు వెళ్లకుండా తన అనుచరులతో పార్లమెంట్ కు వచ్చినట్లుగా రిజిస్టర్ లో సంతకాలు చేయించాడని ఆరోపించారు.
ఓ ఎంపీగా కేసీఆర్ సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని… దీనిపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామని ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. విచారణకు ముందే సీఎం రాజీనామా చేయాలి.. లేదంటే జైలుకు వెళ్లడం ఖాయం అని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రిజెక్ట్ డ్ సమితిగా మారిపోయిందని ఎద్దేవా చేసిన ఆయన, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే పీఆర్సీ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించిన ఆయన… ఇవన్నీ ఎన్నికల సంఘానికి కనపడటం లేదా..? ఉద్యోగ సంఘాల నేతలపై చర్యలు ఉండవా..? అని మండిపడ్డారు. ఉద్యోగులు యాచించద్దని.. శాసించే స్థాయిలో ఉన్నారని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.