బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, తుషార్ లకు సిట్ జారీ చేసిన సీఆర్పీసీ 41ఏ నోటీసులపై తెలంగాణ హైకోర్టు మరో 6 వారాల పాటు స్టే పొడిగించింది.
సోమవారంతో స్టే గడువు ముగియడంతో బీఎల్ సంతోష్ తరఫు న్యాయవాది దాన్ని పొడిగించాలని పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి తొలుత రెండు వారాల గడువు ఇచ్చేందుకు అంగీకరించారు.
అయితే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు ప్రభుత్వ అప్పీల్ పిటిషన్ పై విచారణ పెండింగ్ లో ఉందన్న విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. విచారణ పూర్తయ్యేందుకు మరింత సమయం పడుతుందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
దీంతో హైకోర్టు స్టేను 6 వారాలకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను మరో ఆరు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.