కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మెడికల్ షాపులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జలుబు, జ్వరంతో పాటు గొంతు నొప్పి వంటి ఇబ్బందులతో ప్రజలు మెడికల్ షాపులకు వస్తే మందులు ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేసింది.
ప్రజలు మెడికల్ షాపులకు వస్తే నో మాస్క్-నో మెడిసన్ రూల్ అమలు చేయాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ ఆదేశించింది. కరోనా లక్షణాలతో ఎవరిని గుర్తించినా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని సూచించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.