బ్రిటన్ లో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం రేపుతున్న నేపథ్యంలో… తెలంగాణ ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ చేసింది. బ్రిటన్ నుండి గత వారం రోజులుగా 358 మందికి పైగా వచ్చారని, వారందరినీ ట్రేస్ చేస్తున్నట్లు తెలిపారు.
బ్రిటన్ నుండి వచ్చిన వారందరినీ పాజిటివ్ లేకున్నా వారం రోజుల పాటు క్వారెంటైన్ చేస్తున్నామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. తీవ్రమైన వ్యాధి లక్షణాలున్నా భయపడాల్సిన పనిలేదని, కానీ యూకే నుండి వచ్చి లక్షణాలున్న వారు ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
చిన్నారులు, పెద్దలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలున్న వారు రెండు వారాల పాటు జాగ్రత్తగా ఉండాలని కోరారు.