కేటీఆర్ ఫాంహౌజ్ అక్రమాల అంశంలో డ్రోన్ కేసులో అరెస్ట్ అయి చర్లపల్లి జైల్లో ఉన్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే విచారణలో పోలీసులకు సహకరించాలని సూచించిన న్యాయస్థానం… క్వాష్ పిటిషన్‌లపై పోలీసులను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, కేసును నాలుగు వారాలు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి తరుఫున ఏఐసీసీ నుండి వచ్చిన సుప్రీం కోర్టు సీనీయర్ లాయర్, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ వాదించారు. 14 రోజుల పాటు రేవంత్ జైల్లో ఉన్నారు.
డ్రోన్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న రేవంత్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు కూకట్ పల్లి కోర్టు నిరాకరించింది. దీంతో రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన అభియోగాలు, ఎఫ్‌ఐఆర్, కేసును పూర్తిగా కొట్టివేయాలనే పిటిషన్‌లతో పాటు బెయిల్ పిటిషన్లను దాఖలు చేయగా… బెయిల్ ఇస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.