తెలంగాణ పదవ తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా వైరస్ కారణంగా హైకోర్టు స్టే విధించటంతో కేవలం మూడు పరీక్షలు మాత్రం జరగ్గా మిగిలిన పరీక్షలు వాయిదా పడ్డాయి.
విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారని, తల్లితండ్రులు ఆందోళనలో ఉన్నారని… వెంటనే పరీక్షలను జరిపేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు జూన్ 8నుండి పరీక్షలు నిర్వహించుకోవచ్చని ఆదేశిస్తూ, కొన్ని షరతులు విధించింది.
జూన్ 3న కరోనాపై సమీక్ష నిర్వహించి, 4న కోర్టుకు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయితే ప్రతి పరీక్షకు మధ్య రెండు రోజుల వ్యవధి ఖచ్చితంగా ఉండేలా టైం టేబుల్ ఉండాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. భౌతిక దూరం పాటిస్తతూ, పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ సమర్పించింది. దీంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగుమమైంది.