జీహెచ్ఎంసీలో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై హైకోర్టు విచారించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓటు హక్కును సవాల్ చేస్తూ బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 90(1)ని కొట్టేయాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు.
విచారణ చేపట్టిన న్యాయస్థానం… ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీకి నోటీసులు జారీ చేసింది. సరైన వివరణ ఇవ్వాలని కోరింది. తదుపరి విచారణను జనవరి 4వ తేదీకి వాయిదా వేసింది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ కు 30కి పైగా ఎక్స్ అఫీషియో సభ్యుల బలం ఉంది. అంటే గ్రేటర్ ఎన్నికల్లో 40 స్థానాలు గెలిచినా…. మేయర్ పీఠాన్ని స్వయంగా దక్కించుకునే అవకాశం టీఆర్ఎస్ కు ఉంది. దీంతో ఇది ప్రజాస్వామ్యానికి విరుద్దమంటూ కోర్టును ఆశ్రయించారు.