తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు కన్నుమూశారు. అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో రాష్ట్రంలోని కోర్టులకు ఇవాళ సెలవు ప్రకటించారు. 2017 సెప్టెంబర్ 21 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా కేశవరావు సేవలు అందించారు.
కేశవరావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు సీఎం. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.