అందరి చూపు హైకోర్టువైపు - Tolivelugu

అందరి చూపు హైకోర్టువైపు

telangana high court judgement in rtc employees strike issue, అందరి చూపు హైకోర్టువైపు

ఓవైపు ఆర్టీసీ కార్మికులు, మరోవైపు ప్రభుత్వం హైకోర్టు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన హైకోర్టు తమకు అండగా ఉండి… ప్రభుత్వానికి డైరెక్షన్ ఇస్తుందని కార్మికులు వేయి కళ్లతో ఎదురు చూస్తుండగా, క్యాబినెట్ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు హైకోర్టు లేదు కాబట్టి… ప్రభుత్వాన్ని తప్పుబట్టినా అంతిమంగా తమదే విజయమన్న భావనలో ఉంది ప్రభుత్వం. దీంతో… హైకోర్టు నిర్ణయం ఉత్కంఠగా మారింది.

ముందుగా 5100రూట్లను ప్రైవేటుకు అప్పగించాలనే పిటిషన్ విచారణకు రానుంది. ఇప్పటికే క్యాబినెట్‌ నిర్ణయాలను తమ ముందుంచాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించగా… క్యాబినెట్ నిర్ణయాలను కోర్టులు ఎలా ప్రశ్నిస్తాయి అంటూ సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు.

ఇక ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వ అఫిడవిట్‌లపై మద్యాహ్నం 2.30గంటలకు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో అయోధ్య తీర్పు ఉన్న సమయంలో ఆర్టీసీ కార్మికుల కార్యక్రమాలు, సహ ఇతర కీలక అంశాలను ప్రభుత్వం కోర్టు దృష్టికి తెచ్చింది.

Share on facebook
Share on twitter
Share on whatsapp