వాన్ పిక్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ విచారణకు అనర్హమైందంటూ హైకోర్టు తేల్చి చెప్పింది.
ఈ కేసులో ఛార్జ్ షీట్ చెల్లదంటూ వాన్ పిక్ ప్రాజక్ట్స్ వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. ఈ మేరకు చార్జ్ షీట్ ను హైకోర్టు కొట్టి వేసింది. వాన్ పిక్ కు అనుకూలంగా హైకోర్టు తీర్పు వెల్లడించింది.
దీంతో వాన్ పిక్ కంపెనీతో పాటు, పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లకు భారీ ఊరట లభించింది.
ఉమ్మడి ఏపీలో పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కోసం వాన్ పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు అప్పటి వైఎస్ సర్కార్ భూముల కేటాయించింది. గుంటూరు ప్రకాశం జిల్లాల్లో వాన్ పిక్ కు కేటాయించిన భూములపై సీబీఐ కేసు నమోదు చేసింది.
ఇందులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాన నిందితునిగా ఉన్నారు. ఈ కేసులో ఛార్జ్ షీట్ ను హైదరాబాద్ సీబీఐ కోర్టులో సీబీఐ అధికారులు దాఖలు చేశారు.