ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్.ఆర్.ఎస్, బీఆర్ఎస్‌లపై తెలంగాణ సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే విధించిన స్టే యధావిధిగా కొనసాగించిన హైకోర్టు తేల్చి చెప్పింది. ఇదే అంశం పై సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందన్న హైకోర్టు.. సుప్రీంకోర్టులో ఉత్తర్వులు తర్వాతే విచారణ చేపడతామని పేర్కొంది.
ఎల్.ఆర్.ఎస్, బీ.ఆర్.ఎస్ పై తుది నిర్ణయం జరిగే వరకు అర్జీదారులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయొద్దని ప్రభుత్వానికి హైకోర్టు అదేశించింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన అర్డర్ కాఫీలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్‌లపై ఇప్పటికే మూడు రాష్ట్రాలను ఇంప్లీడ్ చేసిన సుప్రీంకోర్టు… విధివిధానాలను తెలిపాలని రాష్ట్రాలను ఆదేశించింది. దీంతో సుప్రీంలో కేసు తేలే వరకు విచారణను వాయిదా వేసింది. అప్పటి వరకు బీఆర్ఎస్ పై స్టే యధావిధిగా కొనసాగుతుందన్న హైకోర్టు, ఎల్ఆర్ఎస్ పై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఎల్ఆర్ఎస్ మీద ప్రభుత్వం తెచ్చిన జీవో పై ఎలాంటి చర్యలు తీసుకోమని కోర్టుకు ఏజీ హామీ ఇవ్వగా, ఏజీ చెప్పిన స్టేట్మెంట్ ను హైకోర్టు నమోదు చేసుకుంది.